తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేసు విచారణ జాప్యం చేసేందుకే రేవంత్​రెడ్డి ప్రయత్నం'

అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి ఓటుకు నోటు కేసు రాదన్న తన పిటిషన్​పై మళ్లీ వాదనలు వినాలని కోరుతూ... రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై అనిశా కౌంటరు దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితులు రకరకాల పిటిషన్లతో కాలయాపన చేస్తున్నారని కౌంటరులో పేర్కొంది.

acb court  Objection on revanth reddy petition
acb court Objection on revanth reddy petition

By

Published : Jan 18, 2021, 7:36 PM IST

ఓటుకు నోటు కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసేందుకు రేవంత్ రెడ్డి, ఇతర నిందితులు ప్రయత్నిస్తున్నారని అవినీతి నిరోధక శాఖ ఆరోపించింది. అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి ఓటుకు నోటు కేసు రాదన్న తన పిటిషన్​పై మళ్లీ వాదనలు వినాలని కోరుతూ... రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై అనిశా కౌంటరు దాఖలు చేసింది.

ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని.. అనిశా న్యాయస్థానం విచారణ జరపొద్దని కోరుతూ... రేవంత్ దాఖలు చేసిన పిటిషన్​పై ఇటీవల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు వాయిదా వేసింది. అయితే పిటిషన్​ను మళ్లీ తెరిచి మరోసారి వాదనలు వినాలని రేవంత్ రెడ్డి కోరారు.

రేవంత్ రెడ్డి అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితులు రకరకాల పిటిషన్లతో కాలయాపన చేస్తున్నారని కౌంటరులో పేర్కొంది. రీఓపెన్ చేయాలన్న రేవంత్ రెడ్డి పిటిషన్​పై నిర్ణయాన్ని అనిశా న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ఇవాళ విచారణకు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు.

ఇదీ చూడండి: రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details