అవినీతి నిరోధక శాఖ కోర్టులో రేవంత్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. ఓటుకు నోటు కేసు విచారణ అనిశా పరిధిలోకి రాదన్న రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను.. కోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని అనిశా కోర్టు స్పష్టం చేసింది. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
ఓటుకు నోటు కేసు అనిశా పరిధిలోకే వస్తుంది : కోర్టు - రేవంత్‌రెడ్డి కేసు వార్తలు
ఓటుకు నోటు కేసు విచారణ అనిశా పరిధిలోకి రాదన్న రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను... అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని అనిశా కోర్టు ఉద్ఘాటించింది. వాదనలు ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
అవినీతి నిరోధక శాఖ కోర్టులో రేవంత్‌రెడ్డికి నిరాశ
ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని.. అనిశా న్యాయస్థానం విచారణ జరపొద్దని కోరుతూ.. రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇంతకుమునుపే న్యాయస్థానం వాదనలు విని తీర్పు వాయిదా వేసింది. అయితే పిటిషన్‌ను మళ్లీ తెరిచి మరోసారి వాదనలు వినాలని రేవంత్ రెడ్డి కోరగా.. అనిశా కౌంటరు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఈరోజు వాదనలు విన్న కోర్టు తీర్పు వెలువరించింది.