ఈఎస్‌ఐ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌ను అనిశా న్యాయస్థానం కొట్టేసింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు.. ఈఎస్‌ఐలో మందులు, వైద్యపరికరాల కొనుగోళ్లను ప్రభావితం చేశారంటూ అనిశా కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. తన అరెస్టు అక్రమమన్న అచ్చెన్నాయుడు... బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనిశా కోర్టు.. అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.
ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ కొట్టేసిన అనిశా కోర్టు
ఈఎస్‌ఐ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌ను అనిశా కోర్టు కొట్టేసింది. ఈఎస్‌ఐలో మందులు, వైద్యపరికరాల కొనుగోళ్లలో ప్రభావితం చేశారంటూ అనిశా కేసు నమోదు చేసి అరెస్టు చేసింది.
అచ్చెన్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన అనిశా కోర్టు