ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో నిందితులకు అనిశా కోర్టు రిమాండ్ విధించింది. ఐఎంఎస్ మాజీ సంచాలకురాలు దేవికారాణి సహా 9 మందికి ఈనెల 18 వరకు రిమాండ్ విధించింది. ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో కేసులో అనిశా కోర్టులో విచారణ జరిగింది. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పది మందిని అనిశా అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం నిందితులను అనిశా అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈఎస్ఐ కుంభకోణం: నిందితులను ఈ నెల 18 వరకు రిమాండ్ - esi scam case in telangana
తక్కువ రేటుకే బంగారం ఇప్పిస్తామని నమ్మించి రూ.20లక్షలు దోచుకున్న ఘటనలో ఒకరిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు నగరానికి చెందిన మరో వ్యక్తినీ విచారిస్తున్నారు.
16:17 September 04
ఈఎస్‌ఐ కుంభకోణం: నిందితులను ఈ నెల 18 వరకు రిమాండ్
ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో నిందితులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో నిందితులు ఐఎంఎస్ మాజీ సంచాలకురాలు దేవికారాణి, సంయుక్త సంచాలకురాలు పద్మ, నిందితులు శ్రీహరిబాబు, సుజాత, సాగర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజుల ఇళ్లు, కార్యాలయాల్లో అనిశా అధకారులు మరోసారి సోదాలు నిర్వహించారు.
డొళ్ల కంపెనీల ద్వారా రూ.3 వేలు విలువ చేసే వైద్య కిట్లను ఒక్కొక్కటి రూ.13 వేలకు కొనుగోలు చేసినట్లు బయటపడింది. అందుకు సంబంధించి నకిలీ బిల్లులు కూడా సృష్టించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి.
ఇవీ చూడండి:'అసెంబ్లీకి వచ్చే అధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షలు'