రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ కార్యకర్తలు, నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఉద్యోగ విరమణ వయోపరిమితిని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం.. - abvp leaders tried to siege assembly
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ఏబీవీపీ కార్యకర్తలు, అసెంబ్లీ ముట్టడి
వారిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. తోపులాటలో పలువురు ఏబీవీపీ కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు.
- ఇదీ చదవండి :ఉభయసభల ముందుకు కాగ్ నివేదిక