యువతిని అత్యాచారం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఏబీవీపీ చేపట్టిన సీపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ముట్టడిని అడ్డుకునేందుకు ముందస్తుగా బషీర్బాగ్లోని సీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసుల కళ్లు గప్పి ఆటోలో వచ్చిన ఏబీవీపీ నాయకులు సీపీ కార్యాలయం లోపలికి చొచ్చుకపోవడానికి యత్నించారు.
ఉద్రిక్తతంగా మారిన సీపీ కార్యాలయ ముట్టడి... - hyderabad news
యువతి అత్యాచార కేసులో నిందితులను అరెస్టు చేయాలంటూ ఏబీవీపీ నాయకులు తలపెట్టిన సీపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
వారిని అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేయగా... పోలీసులకు ఏబీవిపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొంతమంది నాయకులకు స్వల్పగాయాలయ్యాయి. అమ్మాయిని అత్యాచారం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. బాధితురాలికి రక్షణ కల్పించి... ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపాలన్నారు. తెరవెనుక ఉన్న కీచకులందరినీ కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నాయకులు మండిపడ్డారు.