రాష్ట్రంలోని అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను వెంటనే పున:ప్రారంభించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సాంఘిక సంక్షేమ భవనం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని... వారం రోజులుగా ముగ్గురు కమిషనర్లను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదని విద్యార్థి సంఘం జాతీయ కార్యసమితి సభ్యులు శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు.
'సాంఘిక సంక్షేమ వసతి గృహాలను వెంటే పునఃప్రారంభించాలి' - abvp leaders protest about Social Welfare hostels reopen
హైదరాబాద్ సాంఘిక సంక్షేమ భవనం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలిసినా ఎటువంటి ప్రయోజనం లేదని నేతలు అసహనం వ్యక్తం చేశారు.

abvp leaders protest at Social Welfare Building
లాక్డౌన్ తరువాత గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో అన్యాయం జరుగుతోందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనస్థలికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి గోషామహల్ ఠాణాకి తరలించారు.