ఏబీవీపీ తలపెట్టిన ఇంటర్ బోర్డు ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీగా వచ్చిన ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఎదుట బైఠాయించారు. గేటు లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఇంటర్ బోర్డు ముట్టడి ఉద్రిక్తత.. తోపులాట - ఏబీవీపీ తాజా వార్తలు
ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించారు.

ఏబీవీపీ ఇంటర్ బోర్డు ముట్టడి
ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలని, కళాశాలల భూముల్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని, జీవో 35 ను రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిత డిమాండ్ చేశారు. కళాశాలల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
ఇంటర్ బోర్డు ముట్టడి
ఇవీ చూడండి:పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!