ఈ ఏడాది దీపావళి కొందరికి ఆనందం పంచితే... మరికొందరిలో విషాదం నింపింది. దివ్వెల పండుగ రోజున టపాసులు కాల్చుతూ గాయాలపాలైన 52 మందిని చికిత్స కోసం మాసబ్‌ట్యాంక్‌లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో ఏడుగురికి ఇవాళ శస్త్రచికిత్స చేయనున్నారు. కొందరికి ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించారు. కంటి పరీక్షలు, శస్త్రచికిత్స చేసేందుకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
దీపావళి సంబురాల్లో ప్రమాదం... ఏడుగురి పరిస్థితి విషమం - 20 people injures in firing the crackers
దీపావళి అంటే వెలుగు నింపేది అని చెప్పుకుంటాం. కానీ అదే వెలుగుల పండుగలో అజాగ్రత్తతో కొందరు తన జీవితాల్లో వెలుగును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దివ్వెల పండుగ రోజు అందరూ బాణాసంచా కాల్చటం సాధారణమే. అనుకోకుండానో, అజాగ్రత్త వల్లనో కొంతమందికి కళ్లలో నిప్పురవ్వలు పడి గాయాలయ్యాయి.
దీపావళి సంబురాల్లో ప్రమాదం... ఏడుగురి పరిస్థితి విషమం
TAGGED:
above 20 people injures