తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కన్నుమూత - ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ సతీమణి మృతి

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కనకదుర్గ పార్థీవదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

ABN MD WIFE passed away
ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి మృతి

By

Published : Apr 27, 2021, 12:12 PM IST

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది. రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ కన్నుమూశారు. బ్రెయిన్‌ సంబంధిత వ్యాధితో కొన్ని వారాలుగా కనకదుర్గ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వేమూరి కనకదుర్గ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్‌గా సంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కనకదుర్గ పార్థీవదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

కనకదుర్గ మృతికి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, సినీ నటుడు పవన్​ కల్యాణ సంతాపం తెలిపారు. వేమూరి రాధాకృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

హైదరాబాద్​లోని వేమూరి రాధాకృష్ణ నివాసంలో ఆయన సతీమణి కనకదుర్గ పార్థివదేహానికి చంద్రబాబు, లోకేశ్​, మంత్రులు ఈటల రాజేందర్​, తలసాని శ్రీనివాస్​ నివాళి అర్పించారు.

ఇవీచూడండి:మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details