అధిక ధరలను అరికట్టేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని పలు సూపర్ మార్కెట్లలో దాడులకు దిగారు. జీహెచ్ఎంసీ, తూనికలు కొలతల శాఖ, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో తూనికలు, కొలతల శాఖ దాడులు
హైదరాబాద్ నగరంలోని పలు సూపర్మార్కెట్లు, కిరాణా షాపుల్లో అధికారులు దాడులు నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యవసరాలను అధిక ధరలకు విక్రయించరాదని యాజమాన్యాలను హెచ్చరించారు.
హైదరాబాద్‌లో తూనికలు, కొలతల శాఖ దాడులు
విజయ్‌నగర్ కాలనీ, మెహిదీపట్నం, టోలీచౌకీ ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి ధరల వివరాలను తెలుసుకున్నారు. అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యాలను హెచ్చరించారు.