పండుటాకులకు చివరి మజిలీలో చేయూతగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛను(Aasara Pension in Telangana) పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం(Aasara Pension in Telangana)లో భాగంగా 60 ఏళ్ల వయస్సు గల వృద్ధులకు రూ.2,116 పింఛను అందించేంది.. ఇటీవలే ఈ వయస్సును 57కు తగ్గిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు(Aasara Pension in Telangana) మంజూరు చేసేందుకు ప్రభుత్వం సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కోరారు. సీఎం శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు శనివారం ఆయన బీఆర్కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
Aasara Pension in Telangana : వృద్ధులకు గుడ్‌న్యూస్.. ఆ వయసు దాటిన అందరికీ పింఛన్! - Aasara pension scheme in telangana 2021
రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్యం పింఛన్ల(Aasara Pension in Telangana)ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈనెల 11 నుంచి దీనికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించనుంది. లబ్ధిదారులు మీసేవా కేంద్రాల్లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సర్కార్ సూచించింది.
ఈ నెల 11 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి, పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మీసేవా కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆసరా పింఛను పథకం(Aasara Pension in Telangana)లో భాగంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ రూ.2,116 వృద్ధాప్య పింఛను(Aasara Pension in Telangana) ఇస్తారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 57 ఏళ్లు నిండినవారు ఆసరాకు అర్హులు. ఓటర్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారిస్తారు. దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు మించి ఉండకూడదు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉంటే పింఛను(Aasara Pension in Telangana)కు అనర్హులు.