తెలంగాణ

telangana

ETV Bharat / city

బ్లాక్​ చెయిన్ టెక్నాలజీతో గిన్నీస్ ​కెక్కిన యువతి - black chain technology news

డిజిటల్ యుగంలో డేటా చోర్యాన్ని ఆపడం పెద్ద సవాల్​. హ్యాకింగ్​ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రముఖ సంస్థలు ఫైర్ వాల్స్​ను లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసుకుంటాయి. అందుకే సైబర్ సెక్యూరిటీలో తన సత్తా చూపాలని నిర్ణయించుకుంది ఆంధ్రప్రదేశ్​లోని బెజవాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని వైష్ణవి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సాయంతో సామాజిక మాధ్యమాల్లో డేటాను ఎలా సురక్షితంగా ఉంచాలన్న అంశంపై అంతర్జాతీయ సదస్సులో పేపర్ ప్రజంటేషన్ ఇచ్చి గిన్నీస్ రికార్డును సాధించింది.

a-young-woman-from-vijayawada-has-got-a-place-in-the-guinness-book-of-records-for-her-research-on-black-chain-technology
బ్లాక్​ చెయిన్ టెక్నాలజీతో గిన్నీస్ ​కెక్కిన యువతి

By

Published : Dec 21, 2020, 7:50 PM IST

బ్లాక్​ చెయిన్ టెక్నాలజీతో గిన్నీస్ ​కెక్కిన యువతి

ప్రస్తుత డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాల వినియోగం ప్రతి ఒక్కరి దినచర్యలో ఓ భాగమైంది. అయితే వాట్సప్, ఫేస్​బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో పొందుపరిచే సమాచారం చోరీకి గురవుతుందంటూ తరచూ వింటూ ఉంటాం. ఈ డేటా చౌర్యాన్ని ఎలా ఆపాలన్న అంశంపై లోతైన పరిశోధన జరిపి గిన్నీస్ బుక్​లో చోటు సంపాదించింది ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడకు చెందిన వైష్ణవి.

ప్రపంచం మెచ్చిన పరిశోధన

ఈ యువతి ప్రస్తుతం ఎస్​ఆర్​ఎం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. మొదటి నుంచి సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టిన వైష్ణవి... ఆ దిశగా లోతైన అధ్యయనం చేసింది. రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు బెంగళూరు హ్యాకథాన్​లో పాల్గొని రెండో స్థానం సంపాదించింది. అనంతరం కాలేజీ ఇంటర్న్​షిప్ కోసం అమెరికా వెళ్లింది. డెన్వర్​లో జరిగిన హ్యాకథాన్​లో పాల్గొని రెండో స్థానం సంపాదించింది. అక్కడే బ్లాక్ చెయిన్ సాంకేతిక పరిజ్ఞానం గురించి వైష్ణవి తెలుసుకుంది. ఫేస్ బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలకు సైబర్ సెక్యూరిటీని పెంచాలని వైష్ణవి నిర్ణయించుకుంది. నాలుగు నెలల పాటు బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై అధ్యయనం చేసింది. ఆ పరిశోధన వివరాలపై అక్టోబర్​ 30న సింగపూర్​లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనికి గాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్​లో ఆమెకు చోటు దక్కింది.

యాప్​తో చౌర్యానికి అడ్డుకట్ట

తాను పరిశోధనలో తెలుసుకున్న అంశాలతో వైష్ణవి 'కాయిన్' పేరిట యాప్​ను రూపొందించింది. వినియోగదారుడు సామాజిక మాధ్యమ ఖాతాల్లోని ఫొటోలను డిలీట్ చేసినా కంపెనీ సర్వర్​లో అవి ఉంటాయి. హ్యాకర్స్ ఆ సర్వర్​ను హ్యాక్ చేసి వాటిని తీసుకునే అవకాశముంటుంది. అయితే తాను తయారు చేసిన కాయిన్ యాప్​ను చరవాణిలో పొందుపరచుకోవటం ద్వారా వాట్సప్​, ఫేస్​బుక్ వంటి ఖాతాలను హ్యాకింగ్ చేయటం సాధ్యపడదని వైష్ణవి చెబుతోంది. భవిష్యత్తులో ఎంఎస్ చేసి ఉన్నతమైన కంపెనీలో ఉద్యోగం సంపాదించటమే తన లక్ష్యమని వైష్ణవి తెలిపారు.

ఇదీ చదవండి :కాల్‌సెంటర్‌పై సీసీఎస్ దాడులు

ABOUT THE AUTHOR

...view details