భవనంపై యువతుల వీడియో తీసేందుకు వెళ్లి యువకుడు మృతి - మద్యం మత్తులో భవనం పైనుంచి దూకి యువకుడు మృతి
![భవనంపై యువతుల వీడియో తీసేందుకు వెళ్లి యువకుడు మృతి young man died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16282570-22-16282570-1662297882480.jpg)
18:36 September 04
సికింద్రాబాద్లో యువతుల వీడియో తీసేందుకు వెళ్లి యువకుడు మృతి
సికింద్రాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువతుల వీడియో తీసేందుకు భవనంపైకి వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. చిలకలగూడలో దిలీప్ అనే యువకుడు ఓ భవనంలో నివాసం ఉంటున్నాడు. మద్యం మత్తులో ఉన్న దిలీప్ పై అంతస్తులో ఉన్న యువతుల వీడియోలు తీసేందుకు వెళ్లాడు. కిటికీలో నుంచి వారి వీడియో తీస్తుండగా అదే సమయంలో చుట్టుపక్కల వాళ్లు గమనించి కేకలు వేశారు. దాంతో ఉన్న భవనం నుంచి మరో భవనంపైకి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే కాలు జారి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలై దిలీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: