తెలంగాణ

telangana

ETV Bharat / city

Rape: క్రూరత్వం.. భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారం - వివాహితపై సామూహికఅత్యాచారం

భర్త ఎదుటే ఓ వివాహితపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన రాజస్థాన్​లో జరిగింది. భార్యాభర్తలు బైక్​పై వెళుతుండగా అడ్డగించిన దుండగులు ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో ఓ మహిళను గర్భవతిని చేసి పారిపోయిన వ్యక్తిని బిహార్​లో అదుపులోకి తీసుకున్నారు.

A women Raped in Rajasthan in front of her husband
భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారం

By

Published : Aug 12, 2021, 6:08 PM IST

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది. ఓ వివాహితపై ఆమె భర్త ఎదుటే నలుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.

ఇదీ జరిగింది..

రాజస్థాన్​ బాడ్మెర్​కు చెందిన దంపతులు మంగళవారం బలోత్రాకు బైక్ మీద బయలుదేరారు. వీరిని మార్గంమధ్యలో నలుగురు దుండగులు అడ్డగించారు. నిందితుల్లో ఒకరు బాధిత మహిళ భర్త వాహనాన్ని తీసుకుని ఉడాయించారు. మిగిలిన ముగ్గురు ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు. తర్వాత భార్యాభర్తలిద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించారు. కారులో ఎక్కగానే ముగ్గురూ కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు.

అదుపులో నిందితులు..

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారంపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తును ప్రారంభించారు. 'మాకు సమాచారం అందిన వెంటనే ముగ్గురు నిందితులు కమ్తాయ్, బాబులాల్, నరేష్‌లను అరెస్టు చేసినట్లు బాడ్మెర్ పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ శర్మ తెలిపారు. బాధిత మహిళను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చామని వివరించారు.

పారిపోయిన వ్యక్తి అదుపులోకి..

ఛత్తీస్​గఢ్ పాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచారం కేసులో మహ్మద్ ఇంతియాజ్ అనే వ్యక్తిని బిహార్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇంతియాజ్.. బీహార్‌లోని తన స్వగ్రామానికి పారిపోయాడని తెలిపారు. అయితే గత నెలలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది.

ఇదీ చూడండి:

dead body in refrigerator: ఫ్రిజ్‌లో 93 ఏళ్ల వృద్ధుడి మృతదేహం

ABOUT THE AUTHOR

...view details