తెలంగాణ

telangana

ETV Bharat / city

తాలిబన్ల నరమేధం : హెలికాఫ్టర్​కు ఉరి వేసి.. తుపాకులతో గురి చూసి.! - తాలిబన్లు

అఫ్గానిస్థాన్​లో అగ్రరాజ్యం సైన్యం తిరుగు పయనం గడువు ఇలా ముగిసిందోలేదో.. అలా తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయి. తమ టార్గెట్ లిస్ట్​లో ఉన్న వారిని వరుసబెట్టి మట్టుబెడుతున్నారు. అమెరికా బలగాల చివరి విమానం వెళ్లగానే తాలిబన్లు కాబుల్​ విమానాశ్రయాన్ని కంట్రోల్‌లోకి తీసుకున్నారు.

Taliban
Taliban

By

Published : Aug 31, 2021, 8:04 PM IST

అమెరికా సైనికులు అఫ్గానిస్థాన్​ను పూర్తిగా విడిచి వెళ్లారు. అగ్రరాజ్యం సైన్యం తిరుగు పయనం గడువు ఇలా ముగిసిందోలేదో.. అలా తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయి. తమ టార్గెట్ లిస్ట్​లో ఉన్న వారిని వరుసబెట్టి మట్టుబెడుతున్నారు. ఊచకోతలు, ఉరితీతలతో అమాయకుల రక్తం తాగుతూ తమ ఎజెండా అమలు చేస్తున్నారు. అమెరికా బలగాల చివరి విమానం వెళ్లగానే తాలిబన్లు కాబుల్​ విమానాశ్రయాన్ని కంట్రోల్‌లోకి తీసుకున్నారు.

మంగళవారం తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం బయల్దేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదొక కీలక మార్పు అంటూ సంతోషంలో మునిగిపోయారు.

ఈ సందర్భంగా తాలిబన్‌ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ... ఈరోజు తమకు సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సిద్ధించిందని అభివర్ణించారు.

మరోవైపు తాలిబన్ల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అఫ్గాన్​లోని హజారా మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన 14 మందిని తాలిబన్లు తుపాకులతో కాల్చి చంపారు. వారిలో 12 మంది సైనికులు, మరో ఇద్దరు సాధారణ పౌరులున్నారు. తమ ఆధిపత్యాన్ని హజారా మైనారిటీ వర్గ ప్రజలు అంగీకరించకపోవడం వల్లే తాలిబన్లు ఈ నరమేధానికి పాల్పడినట్లు తెలుస్తోంది. డేకుండి ప్రావిన్స్‌లోని ఖదిర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

తుపాకుల మోతలే కాదు.. తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్న పలువురిని హెలీకాప్టర్​లకు వేలాడదీస్తూ ఉరి వేస్తున్నారు. అమెరికా బ్లాక్ హక్ హెలికాఫ్టర్​పై తాలిబన్లు ఓ వ్యక్తిని ఉరితీసిన విడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

పంజ్‌షీర్‌పైనా తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు. అయితే దాడికి తెగబడిన తాలిబన్లకు మళ్లీ పరాభవం ఎదురైంది. తాలిబన్ వ్యతిరేక దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ పోరులో తాము ఏడు నుంచి ఎనిమిదిమంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు అహ్మద్ మసౌద్ అధికార ప్రతినిధి ఫాహిత్ దష్తీ తెలిపారు.

ఇదీ చూడండి:Afghan Taliban: అఫ్గాన్​ భవితవ్యాన్ని తేల్చేది ఈ 10 ప్రశ్నలే!

ABOUT THE AUTHOR

...view details