ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండపైన కొండల రాయుడు అనే వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి శ్రావణమాసం మూడో సోమవారం నాడు ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. వేడుకల వేళ కొండపైన దొరికిన తేళ్లను పట్టుకుని.. స్వామికి నైవేద్యం పెడతారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఏటా ఇలానే ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి వేడుకలకు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు.. కొండపైన ఉన్న రాళ్ల కింద తేళ్లను పట్టుకున్నారు. వాటిని ఎలాంటి భయం లేకుండా చేతితో పట్టుకుని.. స్వామికి నైవేద్యం చెల్లించారు.
తేళ్లతో దేవుడికి నైవేద్యం పెట్టే వింత ఆచారం, ఎక్కడో తెలుసా - కోడుమూరు వేంకటేశ్వరస్వామి ఆలయం
ఎక్కడైనా దేవుడికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇంకా అయితే ప్రీతిపాత్రమైన ఫలహారాన్నివండి దేవుడికి నైవేద్యం పెడతారు. ఆ ప్రాంతంలో మాత్రం తేళ్లను పట్టుకుని నైవేద్యంగా సమర్పిస్తారు. పెద్దలే కాదు చిన్నపిల్లలు సైతం తేళ్లను భయంలేకుండా పట్టుకుంటారు. చూడటానికి వింతగా ఉన్నా.. ఈ ఆచారం మాత్రం కొన్నేళ్లుగా కొనసాగుతోంది.
scorpions
గతంలో ఈ ఆలయానికి వచ్చి ఈ విధంగా మొక్కులు సమర్పించిన వారి కోరికలు నెరవేరాయని అందుకే ఇప్పుడు తామూ వచ్చి తీర్చుకుంటున్నామని భక్తులు చెప్పారు. ఇలాంటి వింత ఆచారాన్ని చూడాలని ఉంటే మీరూ ఓ సారి కోడుమూరులోని కొండల రాయుడి దేవాలయానికి వెళ్లి రండి మరి.
ఇవీ చూడండి: