డబీర్‌పూర్ చౌరస్తా సమీపంలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టగా తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇద్దరు కారులోంచి ప్రాణాలతో బయటపడ్డారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఎగిసిపడిన మంటలు - అగ్ని ప్రమాదం వార్తలు
మేడ్చల్ జిల్లా డబీర్‌పూర్ చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో వైర్లు తెగిపడి మంటలు వ్యాపించాయి. కారులో ఉన్న వారు స్పల్పగాయాలతో బయటపడ్డారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఎగిసిపడి మంటలు
వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా.. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. స్వల్ప గాయాలవ్వగా చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వాహనం పూర్తిగా దగ్ధం తగలబడింది.
ఇవీ చూడండి:లైవ్ వీడియో: దివ్యాంగుడిని కాపాడిన పోలీస్