తెలంగాణ

telangana

లాక్​డౌన్​ దెబ్బ.. సొంత రాష్ట్రానికి వెళ్లే మార్గం లేక భిక్షాటన

తొమ్మిది పదుల వయసు... అనారోగ్యం.. అయినోళ్లు చెంతనలేరు... ఆసుపత్రిలో చేర్పించి అల్లుడెళ్లిపోయాడు. ఇంతలో లాక్​డౌన్​. హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన ఆ పెద్దాయనకు తోడు నీడా రెండూ లేవు. సొంత రాష్ట్రానికి వెళ్లే మార్గం లేక.. పొట్ట నింపుకోవటానికి భిక్షాటన మొదలుపెట్టాడు. కర్ణాటకకు చెందిన ఓ ముసలితాత ఎదుర్కొంటున్న ఈ దీనగాథ పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

By

Published : Sep 4, 2020, 4:28 PM IST

Published : Sep 4, 2020, 4:28 PM IST

Gnt_Photo Story
కర్ణాటకలోని దేవసముద్రం గ్రామానికి చెందిన వీరస్వామి(92)

కర్ణాటక రాష్ట్రం హుబ్బిళి జిల్లా ధరోజీ గ్రామం వద్ద దేవసముద్రం అనే ఓ చిన్న గ్రామం ఉంది. అక్కడ ఉండే వీరస్వామి (92).. కంటిలో శుక్లాలు తీయించుకునేందుకు అల్లుడితో కలిసి మార్చి నెలలో ఏపీలోని గుంటూరు జీజీహెచ్​కు వచ్చాడు. వైద్యులు 20 రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పగా.. వీరస్వామిని అల్లుడు జీజీహెచ్​లోనే వదిలేసి మహారాష్ట్రకు వెళ్లిపోయాడు.

సొంత రాష్ట్రానికి వెళ్లే మార్గం లేక భిక్షాటన చేస్తున్న వృద్దుడు

ఇంతలో కరోనా కారణంగా లాక్​డౌన్​ ప్రకటించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన ఈ పెద్దాయన ఏం చేయాలో తెలియక ఓ బ్యాగ్​ పట్టుకుని 5నెలలుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు వీరస్వామి.

కర్ణాటకలోని దేవసముద్రం గ్రామానికి చెందిన వీరస్వామి(92)

ఈ వయసులో కూడా ఆ పెద్దాయన తన ఊరిపేరును, ఇతర వివరాలను స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. లారీల ద్వారా వెళ్దామంటే కరోనాకు భయపడి ఎవరూ ఎక్కించుకోవటం లేదని వాపోతున్నాడు. ప్రస్తుతం అమరావతి రోడ్డులో ఉన్న హోసన్న మందిరం వద్ద భోజనం చేస్తూ అక్కడే సేద తీరుతున్నాడు.

ఇదీ చూడండి:

ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి: ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details