తెలంగాణ

telangana

ETV Bharat / city

Viral video: వింత సంఘటన.. వినాయకుడి ఆకారంలో కుక్క పిల్ల జననం - తూర్పుగోదావరి జిల్లాలో గణేశుని ఆకారంలో కుక్కపిల్ల

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా(East Godavari district) కాట్రావులపల్లిలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక శునకం నాలుగు పిల్లలకు జన్మనివ్వగా.. అందులో ఒక కుక్కపిల్ల వినాయకుడి రూపంలో (Puppy born in the form of Ganesha)పుట్టింది. ఈ వింతను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

A PUPPY IN THE SHAPE OF LORD GANESHA
వినాయకుడి ఆకారంలో కుక్క పిల్ల జననం

By

Published : Oct 11, 2021, 5:24 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా(East Godavari district) జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో.. ఈ ఉదయం ఒక శునకం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ముందు పుట్టిన మూడు పిల్లల తర్వాత పుట్టిన పిల్ల వినాయకుని ఆకారంలో పుట్టింది. గ్రామానికి చెందిన ధనికొండ నరసయ్య, అన్నవరం దంపతులు రెండు సంవత్సరాల నుంచి ఓ కుక్కను పెంచుకుంటున్నారు. ఆ శునకం ఈ సారి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఓ పిల్ల.. తొండం, పెద్ద చెవులతో వినాయకుడి ఆకారంలో(Puppy born in the form of Ganesha) జన్మించింది.

సాక్షాత్తూ వినాయకుడే తమ ఇంట్లో జన్మించాడని యజమానులు ఆనందానికి అవధులు లేవు. నిజానికి.. తమ ఇంటి వద్ద వినాయకుడి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నామని.. కానీ అనివార్య కారణాల వల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయామని తెలిపారు. ఇప్పుడు సాక్షాత్తు వినాయకుడే తమ ఇంట్లో వెలిశాడంటూ ఆనందం వ్యక్తం చేస్తూ పూజలు చేశారు. వినాయకుడి ఆకారంలో పుట్టిన కుక్కపిల్లను చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. తమ ఇంటి ముందు వినాయకునికి గుడి కట్టిస్తామని ఆ దంపతులు పేర్కొన్నారు.

వినాయకుడి ఆకారంలో కుక్క పిల్ల జననం

ఇదీ చదవండి:TELUGU AKADEMI FD SCAM: తెలుగు అకాడమీ నిధుల పంపిణీలో ఇంకా ఎవరైనా ఉన్నారా..?

ABOUT THE AUTHOR

...view details