Girl Raped By Father, Brother: మహారాష్ట్రలో అమానవీయ ఘటన జరిగింది. వావివరుసలు మరిచి ప్రవర్తించారు ఆ కుటుంబంలోని వ్యక్తులు. సొంత అన్న, తండ్రే వేర్వేరు సమయాల్లో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాక తాత, మామ కూడా చిన్నారిని లైంగికంగా వేధించేవారని పోలీసులు తెలిపారు. ఇలా ఐదేళ్లుగా బాలిక లైంగిక వేధింపులను అనుభవిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద పుణెలోని బుంద్ గార్డెన్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు.
బాధితురాలు, ఆమె కుటుంబం బిహార్ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వలస వచ్చింది. తన పాఠశాలలో జరిగిన 'గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్' అనే కార్యక్రమంలో బాలిక ఈ విషయాలను వెల్లడించినట్లు ఎస్సై అశ్విని సాత్పుతె తెలిపారు. ఐదేళ్లుగా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు బాలిక చెప్పిందన్నారు. 2017 నుంచి చిన్నారి తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా.. 2020లో బాలిక సోదరుడు సైతం వేధింపులకు గురిచేసినట్లు తేలిందన్నారు.
బాలికపై లైంగిక దాడులన్నీ వేర్వేరుగా జరిగాయని.. ఇది గ్యాంగ్‌రేప్ కాదని అన్నారు ఎస్సై అశ్విని. నిందితులపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
యువతిపై గ్యాంగ్ రేప్..