ఎవరైనా రోడ్డు మీద పాము కనిపిస్తేనే.. ఆమడ దూరం పరుగెడుతారు. అదే ఇంట్లోకి చొరబడితే ఎలా ఉంటుంది. మనమే కాదు ఇంటిల్లిపాది భయంతో వణికిపోతుంటాం.. చుట్టుపక్కల వారిని పిలుస్తాం. కాస్త ధైర్యం తెచ్చుకుని దానిని చంపడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే పాములు పట్టే వాడికి సమాచారం ఇస్తాం.. తాజాగా సంగారెడ్డి జిల్లాలోను ఓ వ్యక్తి తన ఇంట్లోకి దూరిన పామును చంపడానికి బాగానే ప్రయత్నం చేశాడు.. ఎంత ప్రయత్నించినా పాము దొరకపోవడంతో విసిగిపోయిన ఆ వ్యక్తి చేసిన పనికి ఇల్లు పొగొట్టుకుని రోడ్డున పడ్డాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే..
ఇంట్లో కనిపించిన పాము.. ఆ వ్యక్తి చేసిన పనికి రోడ్డున పడ్డ కుటుంబం - పాము వచ్చిందని ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి
సాధారణంగా ఇంట్లోకి పాము వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది.. భయంతో వణికిపోతాం. అక్కడి నుంచి బయటకు పరుగు తీస్తాం. పక్కింటివారికి విషయం చెబుతాం. కాస్త ధైర్యం ఉంటే మనమే కర్రతో దానిని చంపడానికి ప్రయత్నం చేస్తాం.. సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి అలాంటి ప్రయత్నమే చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో అతను చేసిన పనికి కుటుంబం రోడ్డున పడింది.. ఇంతకీ ఆయన ఏం చేశారనుకుంటున్నారా..!
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బడంపేట్ గ్రామానికి చెందిన గడ్డమీది మొగులయ్య ఇంట్లోకి పాము దూరింది. దసరా పండగ సందర్భంగా ఇల్లు శుభ్రం చేసుకుంటుండగా పాము కనిపించింది. దానిని చంపేందుకు ఆ వ్యక్తి కర్ర తీసుకుని ప్రయత్నాలు చేశాడు. ఎంత యత్నించినా పాము దొరకలేదు. దీంతో విసిగిపోయిన మొగులయ్య కారు టైరు కాల్చి పాము ఉన్న స్థలంలో వేశాడు. టైరు కాలే వాసనకు పాము పారిపోతుందని అనుకుంటే.. మంటలు ఇంటి వాసాలకు అంటుకొని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంటిని శుభ్రం చేసుకుని పండగకి ఏర్పాటు చేసుకుంటుండగా... పాము భయంతో ఇల్లు కాల్చుకున్నట్లయిందని యజమాని వాపోయాడు.
ఇవీ చదవండి: