ఏపీలోని విశాఖ జిల్లా సిరిపురం జంక్షన్లో గుర్రం సాయి అనే వ్యక్తి వీరంగం చేశాడు. మద్యం మత్తులో విశాఖ మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సురేష్, హోంగార్డు కుమార్‌పై హత్యాయత్నం చేశాడు.
ఏం జరిగిందంటే..
సాయికి చెందిన గుర్రం బండిని పక్కకు జరపాలని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఆ మాటలను పట్టించుకోని సాయి వివాదానికి దిగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయి... కత్తి పట్టుకుని సెక్యూరిటీ గార్డులను వెంబడించి గాయపరిచాడు. ఈ ఘటన సోమవారం రాత్రి 8.30 గంటలకు జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు సాయిని అదుపులోకి తీసుకున్నారు.