ఏపీలోని విశాఖ గాజువాక పీఎస్లో 11 మంది కాకినాడ వాసులపై అక్రమ నిర్బంధం కేసు నమోదైంది. విశాఖ డైరీ వద్ద ఓ వ్యక్తిని కారులో బలవంతంగా ఎక్కించారని కాకినాడ వాసులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అప్రమత్తమైన పోలీసులు కూర్మన్నపాలెం సమీపంలో నిందితులను పట్టుకున్నారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తి మాస అగస్టీన్గా గుర్తించారు.
విశాఖలో అపహరణ యత్నం... పోలీసులకు చిక్కిన నిందితులు - విశాఖ వాసిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కాకినాడు వాసులు
ఏపీ విశాఖలో ఓ వ్యక్తిని కొందరు బలవంతంగా కారులో తీసుకెళ్తుండగా గాజువాక పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు కాకినాడ వాసులుగా గుర్తించారు. వారిపై అక్రమ నిర్బంధం కేసు నమోదుచేశారు. నిర్బంధించిన వ్యక్తి... ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అందుకే నిర్బంధించే ప్రయత్నం చేశామని నిందితులు అంగీకరించినట్లు చెప్పారు.
విశాఖలో ఓ వ్యక్తి కిడ్నాప్ యత్నం... పోలీసులకు చిక్కిన నిందితులు
అగస్టీన్ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. సుమారు రూ. 66 లక్షలు మేర వసూలు చేశాడని.. అగస్టీన్పై 5 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయన్నారు. ఇచ్చిన డబ్బు వసూలు చేసుకునేందుకు అగస్టీన్ను నిర్బంధించి కాకినాడకు తీసుకెళ్తున్నామని నిందితులు తెలిపారు.