సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి.. రెండో అంతస్తు నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన బాలస్వామి ఈనెల 2న ఛాతి నొప్పితో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ప్రమాదవశాత్తు ఇవాళ ఆస్పత్రి పరిపాలన భవనం రెండో అంతస్తు నుంచి జారిపడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడం వల్ల అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గాంధీ ఆస్పత్రి భవనం నుంచి జారిపడిన రోగి.. - a man fall form gandhi hospital second floor
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి పరిపాలన భవనం రెండో అంతస్తు నుంచి ఓ వ్యక్తి జారిపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడం వల్ల అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

గాంధీ ఆస్పత్రి భవనం నుంచి జారిపడిన రోగి..