ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ గుంతలో పడి కాలు విరిగిందని, దానికి జీహెచ్‌ఎంసీ కారణం అంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పంజాటన్ కాలనీకి చెందిన సయీద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రి ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై నూర్‌ఖాన్ బజార్ నుంచి బాల్‌షెట్టి ఖేట్‌కు వెళ్తుండగా గుంత వల్ల అతను కింద పడ్డాడు. కాలు ఎముక ఫ్రాక్చర్ అయింది. దీనికి రోడ్డుపై ఉన్న గుంతలే కారణమని డబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. తన గాయానికి జీహెచ్‌ఎంసీ అధికారులే బాధ్యత వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రోడ్డుపై గుంతలను పూడ్చకుండా ప్రజల ప్రాణాలతో బల్దియా చెలగాటమాడుతోందని ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాలు విరిగిందని జీహెచ్ఎంసీపై వ్యక్తి కేసు - hyderabad roads issue
జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల తన కాలు విరిగిందని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బల్దియా బాధ్యత వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తన కాలు విరగడానికి జీహెచ్‌ఎంసీ కారణమని పోలీస్ స్టేషన్‌లో కేసు