తన స్థలాన్ని ఆక్రమించి తనను మానసికంగా వేదిస్తున్నారని మహేష్ అగర్వాల్ అనే వ్యక్తి ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అమీర్‌పేటకు చెందిన మహేష్ అగర్వాల్‌కు ఎస్ఆర్ నగర్లో మూడు కోట్ల విలువైన 250 గజాల స్థలం ఉంది. దానిని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'తన భూమి ఆక్రమించి బెదిరిస్తున్నారు' - a man request for protection from land grabbers
అన భూమి ఆక్రమించి తనను బెదిరిస్తున్నారని అమీర్‌పేటకు చెందిన మహేష్ అగర్వాల్ ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. అధికార పార్టీ నేతలే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
'తన భూమి ఆక్రమించి బెదిరిస్తున్నారు'
ఆరు నెలల నుంచి తనను అధికార పార్టీ నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసులకు, పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు అగర్వాల్ తెలిపారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:'ఆరు నెలల్లోపు పట్టణ ప్రగతి కనిపించాలి'