రాజధాని హైదరాబాద్‌లో సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఓ ఇంటి స్థలం రికార్డు ధర పలికింది. ఫార్మా కంపెనీ అధినేత ఒకరు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేశారు. 1,837 చదరపు గజాల స్థలాన్ని కొనేందుకు రూ.41.3 కోట్లను ఆయన వెచ్చించారు. ఇంటి స్థలానికి సంబంధించి ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద లావాదేవీ అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రభుత్వానికి చెల్లించిన స్టాంపు డ్యూటీనే రూ.2.27 కోట్లుగా ఉంది. మరో రూ.20 లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించారు. జనవరి 28న ఈ రిజిస్ట్రేషన్ జరిగింది.
1,837 గజాలు.. రూ.41.3 కోట్లు - జూబ్లీహిల్స్‌లో 1,837 గజాలు.. రూ.41.3 కోట్లు
హైదరాబాద్‌లో సంపన్నుల ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో 1,837 చదరపు గజాల స్థలం రూ.41.3 కోట్లకు అమ్ముడుపోయింది. ఇంటి స్థలానికి సంబంధించి ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద లావాదేవీ అని వ్యాపార వర్గాలు తెలిపాయి.
జూబ్లీహిల్స్‌లో 1,837 గజాలు.. రూ.41.3 కోట్లు
ఈ ప్రాంతంలో గజం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల మధ్య పలుకుతోంది. తాజా లావాదేవీలో మాత్రం చదరపు గజం దాదాపు రూ.2.20 లక్షల వరకు వెళ్లింది. అయితే, జూబ్లీహిల్స్‌లో ఈ ధర అసాధారణమేమీ కాదని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు జి.రాంరెడ్డి అన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తక్కువ విస్తీర్ణంలోని విల్లాలే రూ.20 కోట్ల వరకు పలుకుతున్నాయని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి :సాగుతున్న భూ సమస్యలు... సాగిలపడుతున్న రైతులు