తమిళనాడు సేలం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పొరుగువారే ఓ మహిళపై కత్తితో దాడి చేయగా.. ఆమె ఛాతిలో కత్తి గుచ్చుకుంది. అయితే ప్రాణభయంతో ఆస్పత్రిలో చేరిన ఆమె ఛాతి నుంచి 30 గంటల తర్వాత శస్త్రచికిత్స చేసి కత్తిని తొలగించారు కోయంబత్తూర్ వైద్య కళాశాల ఆస్పత్రి వైద్యులు. ప్రస్తుతం ఆమె సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ జరిగింది!
సేలం జిల్లాలోని క్రిష్ణగిరిలో హోసూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళపై మే 25 రాత్రి పొరుగువారే కత్తితో పొడిచి పారిపోయారు. ఆమె రాత్రంతా నరకవేదన అనుభవించి మే 26న (మరుసటి రోజు) సేలంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరారు. అయితే చికిత్స ఫలించకపోవడం వల్ల కోయంబత్తూర్లోని ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.