తెలంగాణ

telangana

ETV Bharat / city

మత్స్యకారుల వలకు.. భారీ తిమింగలం - విశాఖలో మత్స్య కారుల వలకు భారీ తిమింగలం

ఏపీ విశాఖ జిల్లాలో మత్స్యకారులకు వలకు భారీ తిమింగలం చిక్కింది. భారీ మొత్తంలో చేపల పడ్డాయని... వలను తీరానికి లాక్కొని రాగా.. 30 అడుగుల భారీ తిమింగలం కనిపించింది. ఇలా తిమింగలాలు వలలకు చిక్కుడానికి... రసాయన వ్యర్థాలను సముద్రంలో వదిలేస్తుండటమే కారణమని మత్స్యకారులు తెలిపారు.

A huge whale trapped in a fisherman's ne
మత్స్యకారుల వలకు చిక్కిన భారీ తిమింగలం

By

Published : Mar 21, 2022, 5:45 PM IST

ఏపీ విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని ముత్యాలమ్మపాలెం తీరంలో మత్స్యకారులకు 30 అడుగుల భారీ తిమింగలం చిక్కింది. పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన జాలర్లు తంతడిపాలెం సమీపంలో వేట కొనసాగిస్తుండగా... వలలో తిమింగలం పడింది. భారీ మెుత్తంలో చేపలు పడ్డాయని... వలను తీరానికి లాక్కొని రాగా తిమింగలం కనిపించింది.

ప్రాణాలతో ఉండటాన్ని గమనించి... తిరిగి సముద్రం లోపలకు వదిలేశారు. ఇలా తిమింగలాలు వలలకు చిక్కుడానికి... రసాయన వ్యర్థాలను సముద్రంలో వదిలేస్తుండటమే కారణమని మత్స్యకారులు అంటున్నారు.

మత్స్యకారుల వలకు చిక్కిన భారీ తిమింగలం

ఇదీ చదవండి:Treatment to Cobra: నాగుపాముకి శస్త్ర చికిత్స... ఎందుకో తెలుసా.?

ABOUT THE AUTHOR

...view details