ఆంధ్రప్రదేశ్ విశాఖలోని అరకులోయ పర్యటనకు వచ్చిన పార్లమెంట్ సభ్యుల బృందం.. గిరిజనుల వస్త్రధారణలో సందడి చేశారు. ఎంపీల బృందంలోని అరకు ఎంపీ మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, కేరళలోని ఆలూరు ఎంపీ హరిప్రియ తదితరులు.. గిరిజనుల సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. అరకులోయ పర్యటన వచ్చిన ఎంపీల బృందం.. స్థానిక గిరి గ్రామదర్శనిలో గిరిజనుల మాదిరిగా కట్టుబొట్టుతో కనిపించారు.
MP'S in tribal dress: అరకులోయలో ఎంపీలు.. గిరిజనుల వస్త్రధారణతో సందడి - అరకులో ఎంపీల బృందం పర్యటన
విశాఖలోని అరకులోయ పర్యటనకు వచ్చిన పార్లమెంట్ సభ్యుల బృందం గిరిజనుల వస్త్రధారణతో సందడి చేశారు. ఈ బృందంలోని అరకు ఎంపీ మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, కేరళలోని ఆలూరు ఎంపీ హరిప్రియ గిరిజనుల సంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి. స్థానిక గిరి గ్రామదర్శనిలో గిరిజనుల మాదిరిగా కట్టుబొట్టుతో ఎంపీల బృందం కనిపించారు.
పార్లమెంట్ సభ్యుల బృందం గిరిజనుల వస్త్రధారణతో సందడి
ఈ దృశ్యాలు గిరిజనుల ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్దం పట్టాయి. ఈ అనుభవం తమకు కొత్తగా ఉందని ఎంపీలు అన్నారు. అరకులోయ సందర్శనకు వచ్చే పర్యాటకులు గిరి గ్రామదర్శిని చూస్తే.. కొత్త అనుభూతిని పొందుతారని వారు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి.:CM KCR Delhi tour: రేపు దిల్లీకి సీఎం కేసీఆర్.. అసెంబ్లీ సమావేశం తర్వాత పయనం