రెండోసారి కరోనా సోకడంతో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలు ప్రభుత్వాస్పత్రి పిల్లల వైద్యుడు (28) మృతి చెందారు. నెల రోజుల క్రితం గుంటూరు ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొంది... కోలుకుని తిరిగి విధుల్లో చేరారు.
కడపలో రెండోసారి కరోనా సోకిన ప్రభుత్వ వైద్యుడు మృతి - ఏపీ తాజా వార్తలు
రెండోసారి కరోనా సోకి... పిల్లల వైద్యుడు మృతి చెందారు. కరోనాతో చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలులో ఆయన వైద్యుడిగా పని చేశారు.

కడపలో రెండోసారి కరోనా సోకిన ప్రభుత్వ వైద్యుడు మృతి
14 రోజుల క్రితం ఆయనకు మరోసారి కరోనా నిర్ధారణ కాగా....కడప రిమ్స్, తిరుపతి స్విమ్స్‌లోనూ చికిత్స పొందారు. శ్వాస సమస్య తీవ్రం కావటంతో రెండ్రోజుల క్రితం చెన్నై ఆస్పత్రిలో చేరగా....ఇవాళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.