తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రేమ కోసం: యువతి 60కి.మీ కాలినడక.. ప్రియునితో వివాహం - కాలినడకన వెళ్లి ప్రేమవివాహం చేసుకున్న యువతి

లాక్​డౌన్​ కారణంగా ఎక్కడివారక్కడే లాకైపోయారు. ప్రేమికులకైతే కరోనా పెద్దసమస్యగా మారింది. రోజూ కలుసుకుని ముచ్చట్లు చెప్పుకునే వారు కూడా... వీడియోకాల్స్​కే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఓ యువతి ప్రేమకోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టింది. కరోనా ఆంక్షలను కాదనుకుంది. ఏకంగా 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లింది. మనసు మెచ్చిన యువకుడిని పెళ్లాడింది. రీల్ స్టోరీని మించిన ఈ రియల్ లవ్​స్టోరీ మీరు ఓసారి చదివేయండి!

a girl walked 60killometers for marriage to her lovers in lock down period
a girl walked 60killometers for marriage to her lovers in lock down period

By

Published : Apr 10, 2020, 1:47 PM IST

కరోనా ఆంక్షలు.. ఆ ప్రేమికులను అడ్డుకోలేకపోయాయి. నచ్చిన యువకుడితో ఏడడుగులు వేయాలన్న సంకల్ప బలం.. ఆ యువతితో ఆరు పదుల అడుగులు వేయించింది. రవాణా లేదు.. ఎవరి అండా లేదు. అయినా ఆమె లెక్క చేయలేదు. ఎలాగైనా.. తన ప్రేమికుడిని కలిసి.. మనువాడాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా.. ఒంటరి ప్రయాణం ప్రారంభించింది. ఏపీలోని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి మచిలీపట్నానికి కాలినడకన బయల్దేరింది.

రవాణా సౌకర్యాలు లేకున్నా.. మధ్యలో కరోనా ఆంక్షల కారణంగా ఇబ్బందులు ఎదురైనా.. ఎక్కడా ఆగలేదు. అడ్డంకులు అధిగమించింది. అనుకున్నది సాధించింది. మచిలీపట్నానికి అవలీలగా చేరి ప్రేమికుడు కళ్లేపల్లి సాయి పున్నయ్య (22)ను కలుసుకుంది. మరో క్షణం ఆలస్యం చేయకుండా.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన యువతి కుటుంబీకుల నుంచి ప్రేమ దంపతులకు బెదిరింపులు ఎదురయ్యాయి. చివరికి రక్షణ కోసం.. చిలకలపూడి పోలీసులను ఆశ్రయించింది ఆ జంట.

ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడిన పోలీసులు.. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ జంట పెళ్లిని అంగీకరించేలా చేశారు. రీల్ స్టోరీని మించిన రియల్ లవ్ స్టోరీతో ఒక్కటైన ఈ జంటకు.. అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

మూడో దశ.. విజయవాడలో భద్రత మరింత కట్టుదిట్టం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details