తెలంగాణ

telangana

ETV Bharat / city

షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం.. ఐదు దుకాణాలు దగ్ధం - Kurnool District News

ఏపీలోని కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ​ షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. సమీపంలోని 5 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.25 లక్షలకు పైగా నష్టం జరిగిందని యజమానులు వాపోయారు.

a-fire-accident-in-a-shopping-complex-at-kurnool-district-center
షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం

By

Published : Feb 9, 2021, 12:24 PM IST

Updated : Feb 9, 2021, 3:04 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కేంద్రంలోని మహమ్మదీయ​ షాపింగ్ కాంప్లెక్స్​లో... విద్యుదాఘాతం కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. సమీపంలోని ఐదు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.

ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు.. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. రెండు ఫైరింజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. రూ.25 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:లోటస్​పాండ్​లో అభిమానులతో షర్మిల సమావేశం

Last Updated : Feb 9, 2021, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details