తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కూతురుకి ఓటేసి.. కన్నుమూసిన తండ్రి - చిత్తూరు జిల్లా రామసముద్రం

ఆంధ్రప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ వృద్ధుడు.. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే కన్నుమూశాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

old man died near polling station
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కూతురుకి ఓటేసి.. కన్నుమూసిన తండ్రి

By

Published : Feb 13, 2021, 7:00 PM IST

ఆంధ్రప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్​గా నిలబడిన కుమార్తెకి ఓటు వేసిన ఓ వృద్ధుడు.. అనంతరం పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా రామసముద్రంలో చోటుచేసుకుంది.

రామసముద్రం గ్రామానికి చెందిన గంగప్ప(65).. పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్​గా నిలబడిన కూతురికి ఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్​ కేంద్రానికి చేరుకున్నాడు. ఓటును వినియోగించుకున్న అనంతరం.. పోలింగ్ కేంద్రం బయటకు వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు.

అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాధితుడిని ఆటోలో ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలోనే ఆయన మరణించారు. ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

ఇదీ చదవండి:షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా

ABOUT THE AUTHOR

...view details