SON IDOL: ఎదిగొచ్చిన కుమారుడు కళ్లముందే కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తండ్రి ఎంతో కుంగిపోయారు. చివరికి అతని విగ్రహం చేయించి ఇంట్లో పెట్టుకొని.. ఏటా అతని పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొడుకు జ్ఞాపకాలను పదిలపర్చుకునేందుకు తండ్రి పడే తపనను ఈ ఫాదర్స్ డే (జూన్ 19న) సందర్భంగా తెలుసుకుందాం!ఏపీలోని బాపట్ల జిల్లా వేమూరు మండలం, చావలికి చెందిన విష్ణుమొలకల రామ్మోహన్‌రావు ఎంఈవోగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఈయనకు కుమార్తె, కుమారుడు. బీటెక్ చేసిన కుమారుడు వంశీదీపక్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం చేసేవాడు. గతేడాది వంశీదీపక్ కొవిడ్‌తో పోరాడి మృతి చెందారు. కుమారుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేని రామ్మోహన్.. చాలా వేదన అనుభవించారు. ఆ తర్వాత తేరుకొని రూ.4లక్షలు వెచ్చించి వంశీదీపక్ కాంస్య విగ్రహాన్ని చేయించారు. దాన్ని ఇంటి ఆవరణలో ఏర్పాటు చేయించారు. వంశీదీపక్ జయంతి, వర్ధంతికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
కుమారుడిపై ప్రేమతో.. కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన తండ్రి
SON IDOL: అతనికి తన కొడుకంటే అమితమైన ప్రేమ.. కానీ దురదృష్టవశాత్తు కుమారుడు కరోనాతో మరణించాడు. ఎదిగొచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తండ్రి ఎంతగానో కుములిపోయాడు. ఇక చేసేదేమీ లేక తన పుత్రుడి జ్ఞాపకార్థం కాంస్య విగ్రహం చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు. ఏటా అతని పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
SON IDOL