తెలంగాణ

telangana

Horse: గుర్రంతో పొలం దున్నుతున్న రైతు.. ఎక్కడో తెలుసా?

By

Published : Jul 2, 2022, 4:22 PM IST

ప్రస్తుతం సాంకేతికత మరింతగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. చాలా మంది యంత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు. స్థోమత లేనివారు ఎప్పటిలాగే ఎద్దులతో పొలాన్ని దున్నుతారు.. కానీ ఓ రైతు మాత్రం వినూత్నంగా గుర్రంతో భూమిని దున్నతున్నాడు. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

horse
గుర్రంతో భూమిని దున్నతున్న రైతు

రైతులు సాధారణంగా ఎద్దులతో వ్యవసాయం చేస్తారు. మరికొంత మంది ఆవులను, గేదెలను వినియోగిస్తుంటారు. కానీ ఓ రైతు అందుకు భిన్నంగా సరికొత్త రీతిలో గుర్రంతో సాగు పనులు చేస్తున్నారు.

ఏపీలోని కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని చిన్ననగరికి చెందిన కృష్ణమూర్తి. తనకున్న మూడు ఎకరాల్లో ఆముదం పంట సాగు చేశారు. ఎద్దులు లేకపోవటంతో పెంచుకున్న గుర్రంతోనే కలుపు నివారణ కోసం ఆయన గుంటక తోలారు. దీనిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details