అతి తక్కువ సమయంలో అంతర సేద్యం చేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు ఓ యువ రైతు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామానికి చెందిన సిద్ధప్పకు కాడెద్దులు, వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. 18 ఎకరాల కంది పంటలో ఒకే రోజులో అంతర సేద్యం చేయాలనుకున్నారు సిద్ధప్ప. అందుకు గ్రామానికి చెందిన రామదాసు పొలాన్ని ఎంచుకున్నారు. ఉదయం 5 గంటలకు సేద్యం ప్రారంభించి, మధ్యాహ్నం 1:30 గంటలకు పూర్తి చేశారు.
Young farmer: యువరైతుకు అభినందనల వెల్లువ.. ఇంతకీ ఏం చేశారంటే!
ఓ యువ రైతు ఎనిమిదిన్నర గంటల్లో 18 ఎకరాల పంటలో అంతర సేద్యం చేశారు. కేవలం రెండు ఎద్దులతో.. అంత తక్కువ సమయంలో సేద్యాన్ని పూర్తి చేయటంపై స్థానిక రైతులు అభినందనలు కురిపించారు. అలాగే యువరైతును పూలమాలలతో సత్కరించారు.
యువరైతులు అభినందలు, అంతరసేద్యంలో యువరైతు రికార్డు
సాధారణంగా ఒకే రోజులో అంత పొలంలో అంతర సేద్యం చేయాలంటే కనీసం 4 జతల ఎద్దులతో పని చేయాల్సి ఉంటుంది. ఒక జత ఎద్దులతో అయితే కనీసం ఈ పనికి 4 రోజులు పడుతుందని రైతులు చెబుతున్నారు. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపాడంటూ.. సిద్ధప్పను గ్రామస్థులు పూలమాలలతో సత్కరించి.. అభినందించారు.
ఇదీ చదవండి:Dalitha bandhu: హుజురాబాద్‌లో దళిత బంధుకు మరో రూ.200 కోట్లు