హైదరాబాద్‌లోని ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా సేవలందిస్తున్నారు డా.మహబూబ్‌ఖాన్. శ్వాసకోశ వ్యాధుల నిపుణులైన ఖాన్.. ఛాతీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. ఇండోనేసియా దేశస్థులు 9 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
ఆదర్శం: కరోనా బాధితుల సేవలో వైద్యుల కుటుంబం - hyderabad doctors family
కరోనా వ్యాధి.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. నివారణ ఔషధాలు లేని ఈ వ్యాధికి.. వైద్యులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని రోగులకు చికిత్సలు అందించాల్సిన పరిస్థితి. ఈ వాతావరణంలో ఓ కుటుంబంలోని ముగ్గురు వైద్యులూ కరోనా బాధితుల సేవలోనే తరిస్తుండడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
A family of doctors at the Corona Victims Service
ఆయన భార్య షహనాఖాన్ గాంధీ ఆసుపత్రిలో చర్మవ్యాధుల నిపుణురాలు. ఆమె అక్కడ కరోనా వార్డ్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమార్తె రషిఖాఖాన్ హౌస్‌సర్జన్. ఫీవర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆమె.. కొవిడ్-19 రోగులు, అనుమానితుల నమూనాలు సేకరించడం తదితర విధుల్లో వైద్యులకు సహాయంగా పనిచేస్తున్నారు.