తెలంగాణ

telangana

ETV Bharat / city

పాపం కుక్క: పొరపాటున తలపెట్టింది.. ఇరుక్కుపోయింది - A dog head stuck in a plastic bottle

ప్లాస్టిక్ డబ్బాలో తల దూర్చిన ఓ కుక్క దానిని విడిపించుకోలేక అగచాట్లు పడుతోంది. పది రోజులకు పైగా ఆహారం, నీరు తీసుకోలేక ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటోంది.

a-dog-head-stuck-in-a-plastic-bottle

By

Published : Sep 26, 2019, 8:13 PM IST

పాపం కుక్క: పొరపాటున తలపెట్టింది.. ఇరుక్కుపోయింది

ప్లాస్టిక్‌ డబ్బాలో తల ఇరుక్కుపోయిన ఓ శునకం నీరు, ఆహారం తీసుకోలేక సంకట స్థితి ఎదుర్కొంటోంది. తూర్పు గోదావరి జిల్లా, కొత్తపల్లి గ్రామంలోని ఆ మూగజీవి ఈనెల 14న ఓ ప్లాస్టిక్ డబ్బాలో తలదూర్చింది. అనుకోకుండా డబ్బా మెడకు ఇరుక్కుపోయింది. వదిలించుకొనేందుకు ఎంత ప్రయత్నించినా డబ్బా ఊడి రాలేదు. తిండి, నీరు అందక 14 రోజులుగా ఇలా వీధుల్లోనే తిరుగుతోంది. రోజు రోజుకీ ఆ మూగజీవి పరిస్థితి క్షీణిస్తోంది. కొందరు యువకులు ఈ దుస్థితి గమనించి, డబ్బా తొలగించేందుకుకు ప్రయత్నించినా శునకం అందకుండా పరిగెడుతున్నందున ఫలితం లేకుండా పోతోంది. పశువైద్యాధికారులైనా స్పందిస్తే బాగుండునని స్థానికులు ఆ కుక్కను చూసి ఆవేదన చెందుతున్నారు.

For All Latest Updates

TAGGED:

no food

ABOUT THE AUTHOR

...view details