తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే? - dog complained to police at kphb in Hyderabad

సాధారణంగా మనం ఎవరి మీదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే పోలీసులను ఆశ్రయిస్తాం. మన గోడు వెల్లబోసుకుంటాం. మరి మూగజీవాలు ఎవరి మీదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఏం చేస్తాయి. అవి కూడా పోలీసుల వద్దకే వెళ్తాయా. మిగతా జీవాల సంగతేమో కానీ.. ఓ శునకం మాత్రం తన బాధను చెప్పుకోవడానికో లేక ఎవరిమీదైనా ఫిర్యాదు చేయడానికో పోలీసులను ఆశ్రయించింది. ఈ వింత సంఘటన హైదరాబాద్ కేపీహెచ్​బీలో జరిగింది.

dog went to police, dog complained to si
పోలీసుల వద్దకు వెళ్లిన శునకం, ఎస్సైకి కుక్క ఫిర్యాదు, ఎస్సైకి శునకం ఫిర్యాదు

By

Published : Jun 19, 2021, 7:46 AM IST

తన మొర ఆలకించమంటూ ఓ శునకం.. పోలీసుల ముందు నిలబడింది. తనను కాలనీ నుంచి వెళ్లగొట్టారనో లేక తిండి పెట్టడం లేదనో ఫిర్యాదు ఇద్దామనుకున్నట్లుంది. ఇలా ఎస్సై ముందు తన గోడు వెల్లబోసుకోవడానికి వచ్చింది.

నా గోడు విను సారూ..!

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని పలు కాలనీల్లో ఇటీవల శునకాలపై దాడులు పెరుగుతున్నాయి. ప్రజలు భయంతో వాటిని రాళ్లతో కొడుతున్నారు. అలా వారి బారి నుంచి తప్పించుకుందో ఏమో కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో ఎస్సై ముందు ప్రత్యక్షమైంది ఓ శునకం. ఆ అధికారికి తన బాధను విన్నవించడానికి ప్రయత్నించింది. శునకం బాధ అర్థం కాకపోయినా.. దానికి తిండి పెట్టాలని సిబ్బందిని ఎస్సై ఆదేశించారు. కడుపు నిండగానే ఆ శునకం స్టేషన్​ నుంచి వెళ్లిపోయింది.

ABOUT THE AUTHOR

...view details