తెలంగాణ

telangana

By

Published : Jun 27, 2020, 7:58 AM IST

ETV Bharat / city

అమానవీయం.. జేసీబీతో శ్మశానానికి కరోనా మృతదేహం

కరోనా మానవ సంబంధాలను మృగ్యం చేస్తోంది. అసువులు బాసిన తర్వాత ఆ నలుగురైనా లేకుండా పోతున్నారు. చివరకు జేసీబీ తొట్టే పాడె అయ్యింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం గ్రామంలో మృతి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. అయితే అధికారులు మృతదేహాన్ని ప్రొక్లెయిన్​తో తీసుకువెళ్లడం వివాదస్పదమైంది.

corona-jcb
అమానవీయం..కరోనా మృతదేహం జేసీబీతో శ్మశానానికి తరలింపు

బద్ధవిరోధులైనా చనిపోతే అయ్యో అనుకుంటాం. చివరి చూపు చూసి సానుభూతి ప్రకటిస్తాం.కానీ కరోనా చేటు కాలంలో మానవ సంబంధాలన్నీ మృగ్యమైపోతున్నాయి. చనిపోయిన వ్యక్తిని నలుగురు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి దాపురించింది. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఓ వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతి చెందాడు. వైద్య సిబ్బంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. మృత దేహాన్ని తరలించేందుకు వాహనదారులెవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కలిసి మున్సిపాలిటీ జేసీబీ తొట్టెలో మృత దేహాన్ని తీసుకెళ్లి అంతిమ సంస్కారం చేయించారు. ఈ ఘటన చూపరులను కలచి వేసింది.

అమానవీయం..కరోనా మృతదేహం జేసీబీతో శ్మశానానికి తరలింపు

ABOUT THE AUTHOR

...view details