తెలంగాణ

telangana

ETV Bharat / city

కుక్కర్​లో తల ఇరుక్కుపోయి తల్లడిల్లిన చిన్నారి - cooker stuck in the head of a one year old girl

కుక్కర్​లో తల ఇరుక్కుపోయి ఏడాది వయసున్న చిన్నారి తల్లడిల్లిపోయింది. కుటుంబ సభ్యులు, వైద్యులు కొన్ని గంటల పాటు ప్రయత్నించినా కుక్కర్​ నుంచి వేరుచేయలేకపోయారు. గుజరాత్​ భావ్​నగర్​లో జరిగిన ఈ ఘటనలో చిన్నారి తలను.. చివరకు కుక్కర్​ నుంచి ఎలా బయటకు తీశారంటే..?

ఆడుతుండగా కుక్కర్​లో తల ఇరుక్కుపోయి తల్లడిల్లిన చిన్నారి
ఆడుతుండగా కుక్కర్​లో తల ఇరుక్కుపోయి తల్లడిల్లిన చిన్నారి

By

Published : Jun 14, 2020, 11:39 PM IST

ఇంట్లో ఉండే వస్తువులతో చిన్న పిల్లలు ఆడుకోవటం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో వాటి ద్వారానే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనే గుజరాత్​లోని భావ్​నగర్​లో జరిగింది. ఏడాది వయసున్న ఓ చిన్నారి కుక్కర్​తో ఆడుకుంటుండగా.. పాపం అందులో తల ఇరుక్కుపోయింది. గంటల తరబడి ఆ బాధతో తల్లడిల్లింది.

ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు..

కుటుంబ సభ్యులు గమనించి కుక్కర్​ నుంచి పాపకు విముక్తి కలిగించాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే భావ్​నగర్​లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు ముందుగా పాపకు కుక్కర్​ వల్ల అయిన గాయాలకు చికిత్స చేసి, దానిని తీసేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది సుమారు 45 నిమిషాల పాటు కష్టపడినా.. కుక్కర్​ను తీయలేకపోయారు. చేసేదేమీ లేక.. కుక్కర్లను బాగు చేసే వ్యక్తిని పిలిపించి కట్టర్​తో కత్తిరించారు. చివరకు కుక్కర్ లోంచి పాప తల బయటకు రావడం వల్ల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చూడండి : పెద్దల సభకు వెళ్లే ఆ 18 మంది ఎవరు?

ABOUT THE AUTHOR

...view details