తెలంగాణ

telangana

ETV Bharat / city

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆస్మిత్​ రెడ్డి సహా 31 మందిపై కేసు

గురువారం జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు ఆస్మిత్​ రెడ్డిపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు. విడుదలయ్యాక కొవిడ్ నిబంధనలు పాటించలేదంటూ జేసీ ప్రభాకర్​ రెడ్డి, ఆస్మిత్​రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి సహా 31 మందిపై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆస్మిత్​ రెడ్డి సహా 31 మందిపై కేసు
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆస్మిత్​ రెడ్డి సహా 31 మందిపై కేసు

By

Published : Aug 7, 2020, 5:23 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు ఆస్మిత్​ రెడ్డిపై కడపలో కేసు నమోదైంది. వాహనాల రిజిస్ట్రేషన్‌ అక్రమాల కేసులో ఇటీవల అరెస్టైన వీరు... గురువారం కడప జైలు నుంచి విడుదల అయ్యారు. జేసీ విడుదల సందర్భంగా భారీగా తెదేపా కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. అయితే ఈ సమయంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిచారంటూ జేసీ ప్రభాకర్​ రెడ్డి, ఆస్మిత్​రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి సహా 31 మందిపై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని అనంతపురం పీఎస్‌లో పోలీసులు కూర్చోబెట్టారు. విడుదలకు సంబంధించి సంతకాలు పూర్తయినా ప్రశ్నించాలంటూ అక్కడే ఉంచారు. స్టేషన్‌లో ఎందుకు కూర్చోబెట్టారో పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా తాడిపత్రికి పోలీసు బలగాలు భారీగా చేరుకుంటున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో తాడిపత్రికి వివిధ విభాగాల్లో ఉన్న పలువురు డీఎస్పీలు చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details