తెలంగాణ

telangana

ETV Bharat / city

Chintamani Natakam: 'చింతామణి నాటకం నిషేధం జీవో రద్దు చేయండి' - ఏపీ వార్తలు

Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం జారీచేసిన జీవో 7ను రద్దు చేయాలని అభ్యర్థించారు.

Chintamani natakam
ap high court

By

Published : Jan 30, 2022, 12:26 PM IST

Chintamani Natakam : చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ఈనెల 17న ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్​ చేస్తూ ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వైకాపా ఎంపీ (నర్సాపురం) రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని ప్రతివాదులుగా చేర్చారు.

దేవదాసి వ్యవస్థపై అవగాహన, వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారని పిటిషన్‌లో వివరించారు. 1920 నుంచి ఎలాంటి అవరోధం లేకుండా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేలమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని.. పూర్తిగా నిషేధిస్తే వారు రోడ్డున పడతారని ఏపీ రఘురామకృష్ణరాజు తన పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ నాటకం ప్రదర్శించిన కళాకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గతంలో పలు అవార్డులు, బహుమానాలు ఇచ్చాయని గుర్తుచేశారు. కళాకారుడు స్థానం నరసింహారావును 1956లో కేంద్ర ప్రభుత్వం.. పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. న్యాయవిచారణ ముందు నిలువదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో 7ను రద్దుచేయాలని అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details