తెలంగాణ

telangana

ETV Bharat / city

తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్​పై కేసు - mangalagiri news

తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్​పై మంగళగిరిలో కేసు నమోదైంది. తనకు ఆలపాటి సోదరుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఎన్నారై ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

alapati raja
తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్​పై కేసు

By

Published : Apr 23, 2021, 9:55 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్​పై మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ మంగళగిరి ఎన్నారై ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ ఉపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉపేంద్ర ఫిర్యాదుపై పోలీసులు 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆలపాటి రాజా సోదరుడు రవీంద్రను ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్స్​లో డైరెక్టర్​గా తిరిగి తీసుకోవాలంటూ బెదిరించారని.. తనతో దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవీచూడండి:రాత్రి కర్ఫ్యూ విధిస్తే సరిపోతుందా?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details