Car into sagar right canal: విషాదం.. ఎమ్మెల్యే సోదరుడి భార్య, కుమార్తె మృతి - ఏపీ వార్తలు
22:06 January 11
Car into sagar right canal: విషాదం.. ఎమ్మెల్యే సోదరుడి భార్య, కుమార్తె మృతి
Car into sagar right canal: సాగర్ కుడి కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటన విషాదం నింపింది. గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే సోదరుడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిన్నాన్న కుమారుడు మదన్ మోహన్ రెడ్డి భార్య, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల వద్ద జరిగింది.
నిన్న రాత్రి సాగర్ కుడి కాలువలోకి కారు దూసుకెళ్లగా.. స్థానికులు వెంటనే మదన్‌మోహన్ రెడ్డిని కాపాడారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లల కోసం గాలింపు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయ చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చూడండి: