తెలంగాణ

telangana

ETV Bharat / city

కారు.. ఏనుగు ఢీ! ఎవరి బలమెంతో చూసుకుందామా? - గజరాజు

The elephant hit the car: వన్యప్రాణులు దారి తప్పి జనవాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. అలా రోడ్లపై పులులు, సింహాలు సైతం దర్శనమిస్తున్నాయి. అధికారులు వాటిని అటవీలోకి పంపించడానికి అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. అలాంటి ఘటనే చిత్తూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఏనుగు ఒక్కసారిగా రహదారిపైకి రావడంతో అదుపుచెయ్యలేక ఆ గజరాజునే గుద్దిందో కారు. ఏనుగు పరిస్థితి తెలియకపోయినా ఆ కారు మాత్రం నుజ్జునుజ్జయింది

The elephant hit the car
కారును గుద్దిన ఏనుగు

By

Published : Sep 18, 2022, 9:50 AM IST

The elephant hit the car: గజరాజు ఒక్కసారిగా రహదారిపైకి రావడంతో అదుపుచెయ్యలేక ఆ గజరాజునే గుద్దిందో కారు. ఏనుగు పరిస్థితి తెలియకపోయినా ఆ కారు మాత్రం నుజ్జునుజ్జయింది. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి చిత్తూరు వెళ్తున్న కారు, రోడ్డు దాటుతున్న గజరాజును వేగంతో బలంగా ఢీకొంది. ఇలా ఢీకొట్టడంతో కారు మొత్తం ఆనవాలు లేకుండా అయిపోయింది. అంత బలంగా గుద్దడంతో పాపం గజరాజు పరిస్థితి ఎలా ఉందో.. కానీ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ ఏనుగు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఏనుగు గుద్దడంతో నుజ్జనుజ్జయైన కారు

ABOUT THE AUTHOR

...view details