ఏపీలో కొత్తగా 9,881 కరోనా కేసులు.. 51 మరణాలు - corona death toll in ap
20:17 April 26
ఏపీలో కొత్తగా 9,881 కరోనా కేసులు.. 51 మరణాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రళయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 74,041 నమూనాలను పరీక్షించగా.. 9,881 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ఇరకు నమోదైన కేసుల సంఖ్య 10,43,441కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా కరోనా మహమ్మారితో 51 మంది ప్రాణాలు కోల్పోగా..ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,736 గా నమోదైంది.
తాజాగా 4,431 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 95,131 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. చిత్తూరు, నెల్లూరులో ఆరుగురు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి నలుగురు, గుంటూరు, కడప, కృష్ణ, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి:1నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ప్రమోట్