దిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన 98 మందిని రాచకొండ పోలీసులు గుర్తించారు. వీరిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధరణ అయింది. వారి బంధువుల్లో మరో ముగ్గురికి కూడా కొవిడ్-19 సోకినట్టు రాచకొండ పోలీసులు తెలిపారు. మరో 26 మంది ఆస్పత్రిల్లో ఉండగా... 56 మంది ప్రభుత్వ క్వారంటైన్‌లో, 14 మంది వారి స్వగృహాల్లో క్వారంటైన్‌లో ఉన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిథిలో 98 మంది
రాచకొండ పోలీస్ కమినషరేట్ పరిథిలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 98 మందిని పోలీసులు గుర్తించారు. వీరిలో 10 మందికి వైరస్ సోకింది. మిగిలిన వారిని క్వారంటైన్‌లో ఉంచారు. కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన వ్యవహారంలో 13 కేసులు నమోదయ్యాయి.
రాచకొండ
మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన వ్యవహారంలో 13 కేసులు నమోదయ్యాయి. 12 ద్విచక్ర వాహనాలు. అయిదు కార్లను పోలీసులు సీజ్ చేశారు.
ఇవీ చూడండి:విరజిమ్మిన వెలుగులు.. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు